పోలీస్ ల అదుపులో ప్రేమజంట…

నవతెలంగాణ – అశ్వారావుపేట
సోషల్ మీడియా ఏర్పాటు అయిన ఉద్దేశ్యం ఒకటైతే దాని తీరుతెన్నులు మాత్రం అడ్డదారులు తొక్కుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసి ఓ ప్రేమ జంట పోలీస్ లు అదుపులోకి వెళ్ళింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికకు కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం కు చెందిన ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇదీ కాస్తా ప్రేమకు దారి తీయగా, రెండు రోజుల క్రితం సదరు మైనర్ బాలిక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ప్రియుడి వద్దకు చేరింది. అంతేకాకుండా తాను ప్రేమించిన యువకుడి వద్దకు వచ్చానని తల్లిదండ్రులకు సైతం ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దాంతో బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె మైనర్ కాగా, కనిపించడం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో ఏపీ నుంచి వచ్చిన పోలీసులు యువకుడితో పాటు, మైనర్ బాలికను అదుపులోకి తీసుకొని తీసుకెళ్లారు.దీనిపై స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ పీ శ్రీకాంత్ ను వివరణ కోరగా.. మిస్సింగ్  కేసులో భాగంగా ఏపీ పోలీసులు యువకుడి ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి తరలించినట్లు చెప్పారు.
Spread the love