ప్రకృతిని ప్రేమించండి… పర్యావరణాన్ని పరిరక్షించండి

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రకృతిని ప్రేమించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం   నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు  మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో  కోర్టు ప్రాంగణంలో 40 మొక్కలు నాటారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఒక మొక్క నాటి కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సంపూర్ణ ఆనంద్, ఉమెన్ కోర్టు జడ్జి  కవిత,  సీనియర్, జూనియర్ జడ్జిలు  బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి,  గిరి లింగయ్య గౌడ్, గోలి అమరేందర్, ఇతర న్యాయవాదులు, నల్లగొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు,  కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
Spread the love