ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థినీ…
అవును ప్రతి ఒక్కరు తమ జీవితంలో
ఒక్కసారైనా రాసే పరీక్ష ఇది.
ఇది పరీక్ష మాత్రమే కాదు పాస్ కాకపోతే పడే శిక్ష కూడా
తొలిచూపు ప్రేమ తొలివలపు ప్రేమ తొలి గెలుపు ప్రేమ
ఇది వినడానికి పులకరింపులు, తేడా వస్తే జలధరింపులు
కాదంటారా? ఇవేవీ అందరికీ తెలియదంటారా??
తెలుసు కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రేమలో గెలుస్తాము అన్న నమ్మకం
ఆ నమ్మకమే జీవితం, జీవితమే ఓ కాగితం
తొలిప్రేమ తర్వాత మలి ప్రేమ
మొదట చేసిన తప్పులను ఒప్పులుగా మలిచే ప్రేమ
గుండెకు తగిలిన గాయాన్ని మాన్పే ప్రేమ
ఒంటరి నడకకు తోడుగా నిలిచే ప్రేమ
కాదంటారా??? ఇవేవి అందరికీ తెలియదంటారా??
తెలుసు కానీ ఈసారైనా తన చెయ్యి అందుకుంటామన్న నమ్మకం
ఆ నమ్మకమే పట్టుదల, పట్టుదలే నా ఎదుగుదల
తొలిప్రేమ మలి ప్రేమ మధ్యలో నలిగిన జీవితాలెన్నో,
మనసును నమ్మి ముక్కలైన హదయాలెన్నో
మనిషిని నమ్మి చేసుకున్న సరదాలెన్నో
అవకాశమే అదునుగా నటించిన నాటకాలెన్నో
జీవన చదరంగంలో నన్ను పావుగా మార్చి
నువ్వు ఆడిన ఆటలెన్నో
లెక్కిస్తే దుఃఖిస్తాను దుఃఖిస్తే మరణిస్తాను,
మరణిస్తే………… సమాధానం లేదు
– విరహపక్షి