బంగాళాఖాతంలో అల్పపీడనం..

నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Spread the love