
నవతెలంగాణ- దుబ్బాక
రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం దుబ్బాక లోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.2020 వ సంవత్సరంలో ప్రకటించిన ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు 25 శాతం రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ఈనెల 30 వ తేదీ వరకు గడువు ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.