ఈనెల 6వ తారీఖున మండల కేంద్రంలోని రైతు వేదికలో లక్నావరం చెరువు రభీ తైబందీ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు లక్నవరం చెరువు ఏఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మండలంలో గల లక్నవరం చెరువు సాగు రైతాంగానికి, ప్రజాప్రతినిధులకు, విలేఖరులకు తెలియజేయునది శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గోవిందరావుపేట రైతు వేదికలో యాసంగి 2024-25 లక్నవరం కాలువలకు సంబంధించి తైబంది సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున గోవిందరావుపేట మండల ప్రజాప్రతినిదులు, రైతులు, పాత్రికేయులు సకాలంలో వచ్చి సమావేశంలో పాల్గొనవలసిందిగా సూచించారు.