మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ – ఆర్మూర్  
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం బుధవారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎందు నిర్వహించినారు. ఈ సమావేశానికీ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ  మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెలకు పదివేల వేతనం ఇవ్వాలని కార్మికులందరికీ ఈఎస్ఐ,పీఎస్ సౌకర్యం కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్లాబ్ రేటు పెంచాలని కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఇవ్వాలని ప్రతి నెల ఐదో తారీకు డబ్బులు వచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించి ఇవ్వాలని బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒకవైపు ధరలు ఆకాశాన్ని అందుతున్నప్పటికిని ఇచ్చే వేతనం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అని అన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేసి నెల నెల వేతనం ఇవ్వాలని అన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక…
 మండల అధ్యక్షరాలుగా  సరూప కార్యదర్శిగా జక్కం సుజాతను ఉపాధ్యక్షురాలు  జయ, షాహిద్ సుల్తానా, దయమని సహాయ కార్యదర్శి  లక్ష్మి కోశాధికారిగా శంకర్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కుతాడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love