వక్ఫ్ భూమిని కబ్జా నుండి కాపాడాలి: ఎంఏ ఇక్బాల్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ భూములను కాపాడాలని సోమవారం యాదాద్రిభువనగిరి వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భూములను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో సర్వే నెంబర్ 356 లోని 2-6గుంటలు 114సర్వేనెంబర్ లోని 2-21గుంటల భూమి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని అనేక రకాలైన తప్పుడు ప్రాంతాలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారని దీనిని పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు వక్ఫ్ భూములను కాపాడడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉందని దీని ఆసరా చేసుకొని రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేయాలని చూస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి చౌటుప్పల్ పట్టణంలోని 4- 27 భూమిని సర్వే చేసి వక్ఫ్ బోర్డుకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ భూములను యాదాద్రి భువనగిరి జిల్లావక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పరిశీలించిన అనంతరం ఆర్డిఓ జగన్నాథ రావు  సమస్యకు సంబంధించి మెమోరాండం అందజేశారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మెమోరాండం అందజేశారు. దీంతోపాటుగా చౌటుప్పల్ డివిజన్లోని అనేక గ్రామాలలో ఉన్న భూమిని కాపాడాలని ఆ భూములకు హద్దురాళ్ళు ఏర్పాటు చేసి కబ్జాలకు పాల్పడే వారిపై చట్టయితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విషయాన్ని పరిశీలించిన ఆర్డిఓ  సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వేదిక గౌరవాధ్యక్షులు ఎస్కే లతీఫ్ వేదిక కన్వీనర్ మహమ్మద్ పాషా,ఎండి గౌస్,ఎండి రహీం మహమ్మద్,కైఫ్,ఎండి సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love