హైదరాబాద్ : ప్రముఖ ప్రయివేటు రంగ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్ డివిజన్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా మధు శశిధర్ నియమితులయ్యారు. ఆ సంస్థలోని హాస్పిటల్ వ్యాపారాలను నిర్వహించనున్నారు. పాండిచ్చేరిలోని జిప్‌మెర్‌లో వైద్య విద్యను పూర్తి చేసిన శశిధర్‌కు న్యూయార్క్‌లోని సెయింట్ లూక్‌స రూస్‌వెల్ట్ హాస్పిటల్‌లో పని చేసిన అనుభవం ఉంది. 2023 అక్టోబర్ నుంచి అపోలోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. శశిధర్ అంతర్జాతీయ అనుభవం తమ సంస్థకు కలిసి రానుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అపోలో సంస్థలో 27 ఏళ్ల పాటు సేవలందించిన డాక్టర్ కె హరిప్రసాద్ ప్రస్తుత ప్రెసిడెంట్ తన పదవి నుంచి విరమణ పొందనున్నారు. కాగా అపోలో ఎండి సునీతా రెడ్డికి శశిధర్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.