మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని జేఎం కే పి ఎం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని మహా రాష్ట్ర ఇంగోలి జిల్లా రైతు మహిళ ఉత్పత్తిదారుల సంఘాలు బుధవారం సందర్శించాయి. మహారాష్ట్ర ఇంగోలి జిల్లా నుండి పహిని , గిరిగావ్, తూర్పు పింప్రి ల్ అట్లాగే పాంగ్ రా సిండి అనే గ్రామాల నుండి నారి అనుముల్ అనే మహిళా రైతు ఉత్పద్దార్ల సంఘాల నుండి మహిళా రైతులను స్మార్ట్ మహారాష్ట్ర ప్రభుత్వంలోని స్మార్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మనోహరాబాద్ గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా స్మార్ట్ ఆర్గనైజేషన్ మహారాష్ట్ర ప్రభుత్వ రైతు ఉత్పత్తిదారుల సంఘాల అధికారి బాలాజీ రాథోడ్ ఈ యొక్క పసుపు పరిశ్రమ గురించి తెలుసుకొని మహిళా రైతులకు వివరిస్తూ స్థానిక జెఎంకెపియం డైరెక్టర్ పాటు కూరి తిరుపతి రెడ్డి రైతు ఉత్పద్దాల సంఘాలు నిర్మాణం బలోపేతం , మార్కెటింగ్ విషయాలు వివరిస్తూ మా యొక్క మహిళలకు రానున్న కాలంలో రైతు ఉత్పద్దాల సంఘాల పట్ల అవగాహన కల్పించడం మాకు ఒక మంచి విషయం తెలియపరిచిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క సందర్శన మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జేఎంకేపిఎం సూపర్వైజర్ రోడ్డ రుత్విక్ , సభ్యులు కంఠం మల్లయ్య పడకల్ పాల్గొనడం జరిగింది.