
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ గ్రామంలో ఈనెల 2 , 3, 4వ తేదీలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ యాదవ్ ఎంపికయ్యారు. ఇటీవలనే యాదాద్రి భువనగిరి జిల్లాలో 70వ జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ సెలక్షన్స్ వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా బుర్ర మహేందర్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ టీంకు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా వాసి మహేందర్ యాదవ్ ఎంపిక కావడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.