నవ తెలంగాణ – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అబిడ్స్‌లో ఆధునిక, అప్‌గ్రేడెడ్ ఎటిఎంను ఏర్పాటు చేసింది. దీనిని ఆ బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులతో కలిసి భగ్‌వతి దేవి బల్డ్వా, రామ్‌నారాయణ బోగ లాంచనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు అత్యంత భద్రతతో పాటు అనేక ఆధునిక ఫీచర్లను ఈ ఎటిఎంను అందుబాటులోకి తెచ్చామని రామ్ నారాయణ అన్నారు. ఆధునిక టెక్నాలజీని తమ ఖాదారులకు అందించడంలో మహేష్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో 45 బ్యాంక్ శాఖలను కలిగి ఉన్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.2,682 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేశామన్నారు.