షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం

నవతెలంగాణ – కంటేశ్వర్
షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సలహాదారులుగా, మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నిజామాబాద్ పట్టణానికి శుక్రవారం వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయనకు ఘన స్వాగతం బోర్గాం  నుండి వందలాధి కారులతో భారీ ర్యాలీగా పట్టణానికి వచ్చారు.బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ మున్నూరు కాపు సంఘం లో పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలందరూ  ఆనందంగా ఉందన్నారు.బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఒకటి ఒకటిగా బయటపడుతున్నాయి ఒక ప్రభుత్వ అధికారి 500 కోట్లు లూటీ చేశాడంటే రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారు ఇట్టే అర్థమ మౌ తుందన్నారు.అవినీతి చేసిన వారిని ఒక్కొక్కరిగా వెలికి తీసి జైలుకు పంపుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఆరు హామీల్లో రెండు అమలు చేసింది త్వరలో ఇంకో రెండు అమలు చేస్తుందన్నారు.అలాగే ప్రభుత్వంలో వచ్చిన రెండు నెలల్లో 26,000 మందికి ఉద్యోగ లు ఇచ్చాము.పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దమని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుని నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం అని తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు  కష్టపడి తప్పకుండా గెల్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారిని తప్పకుండా ఆదరిస్తుంది దానికి ఉదాహరణ నేనే ఒక సామాన్య కార్యకర్త నుండి  ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది. కష్టపడ్డ వారిని గుర్తించి తప్పకుండా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులకు ధన్యవాదాలు నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తో పాటు ఇతర జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love