జీపీ కార్మీకుల ధర్నాను విజయవంతం చేయండి: సీఐటీయూ

నవతెలంగాణ – జుక్కల్

జిల్లా లోని గ్రామ  పంచాయతి వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ అధ్వర్యంలో గురువారం నాడు హైద్రాబాద్ లోని కమీషనరేట్ వద్ద నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త దర్నాకు కీర్మీకులు బారీగా  తరలివచ్చి దర్నా  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కమిటి సబ్యుడు సురేష్ గొండ తెలిపారు. ఈ సంధర్భంగా సురేష్ గొండ మాట్లాడుతు గ్రామ పంచాయతి కార్మీకులకు , మల్టీ పర్పస్ విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. జీపీ  కార్మీకులందరికి పర్మినెంట్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు రూపాయలు ఇస్తు గ్రాట్యుయిటి అమలు చేయాలని డిమాండ్ చేస్తు ప్రభూత్వానికి విఙ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల గ్రామ పంచాయతి కార్మీక సంఘం అద్యక్షుడు వాగ్మారే గోవింద్, జీపీ కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love