
నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఈ నెల 24 జరిగే రేవంత్ రెడ్డి ప్రజా దీవెన బహిరంగ సభ విజయవంతం చేయాలని మండల కో ఆప్షన్ మెంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యాదగిరిగుట్ట మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ యాకుబ్ పిలుపునిచ్చారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గెలుపు కోసం నియోజకవర్గంలోని ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు నాయకులు, కర్షక, కార్మిక విద్యార్థి, ఉద్యోగ ఇతరత్రా సంఘాల అన్ని రంగాలతో ప్రజల తో పాటు మైనారిటీకి సంబంధించిన ప్రజలు అత్యధికంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కార్యక్రమంలో పాల్గొననున్నారుని, జిల్లాలో ఉన్న మైనారిటీలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ఆలేరు నియోజకవర్గం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలకు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. సాగు త్రాగునీటి సమస్యలతో పాటు, నిరుద్యోగం, పేదరికం, వెనుకబడిన అభివృద్ధికి రోడ్లు రవాణా లతోపాటు ఆలేరు నియోజకవర్గ ప్రజలు కోరుతున్న రఘునాథపురం, మాదాపురం కొత్త మండలాలు ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించడానికి హామీ ఇవ్వనున్నారని నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట తో పాటు జైన పుణ్యక్షేత్రం కొలనుపాక కు అభివృద్ధికి అవసరమైన చర్యలు హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.