ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – భువనగిరి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ లో ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ కరపత్రం విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు  అంటే చాలామంది విద్యార్థులు భయాందోళనకు గురవుతు ఉంటారు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఉన్న ప్రతిభని వెలికి తీయడం కోసమే ఈ ఎస్ఎఫ్ఐ ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని అన్నారు. ఈ పరీక్షలో విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 18వ తేదీన ఆదివారం రోజున భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఈ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ జిల్లా వ్యాప్తంగా 15 మండల కేంద్రాలలో ఒకేరోజు నిర్వహిస్తున్నామని వారు అన్నారు. SFI ” అధ్యయనం- పోరాటం” అనే ఆచరణాత్మక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. విద్యారంగ సమస్యల పరిస్కారానికి అనునిత్యం పోరాడుతూనే విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని  ఎస్ ఎఫ్ఐ గర్తు చేస్తూ, త్వరలో జరుగనున్న వార్షిక పరీక్షలకు మిమ్మలను సిద్ధం చేసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందన్నారు. అందుకే విద్యార్థిని విద్యార్థులు అంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ సిరికొండ భవ్య ఎస్ఎఫ్ఐ నాయకులు కొండాపురం నవీన్ కుమార్ నాగేల్లి శివ, చేగోరి వేణు, లోడి మహేష్, పచ్చిమట్ల శివమణి, కనుగొని సాయి, తేజ, సిరిపురం నాగ శేషు పాల్గొన్నారు.
Spread the love