బసవేశ్వర్ విగ్రహ ప్రారంభోత్సవాన్ని విజయవంత చేయండి

– మండల వీరశైవ లింగాయత్ సమాజ్

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మంజల కేంద్రంలో బసవేశ్వర్ విగ్రహ ప్రారంబోత్సవాన్ని  వీర శైవ లింగయత్ సమాజ్ సోదర సోదరి  మణులు , ఇతరులు భారీ సంఖ్యలో పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వీరశైవ లింగాయత్ సమాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ సంధర్భంగా ఈ కార్యక్రమానికి స్వాములు  హనేగాంకర్, కౌలాస్ మహంతయప్పా,  జుక్కల్ బసవలింగాయప్పా, ఖత్గాం మల్లికార్జుప్పా,  బిచ్కుంద మఠ్  సంస్థాన్ పీఠాదీపతి స్వామీ సోమయప్పా, తములుర్ అప్పగారు  తో పాటు జహిరాబాద్ ఎంపి బిబి పాటీలో జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ , మాజీ ఎమ్మెలేలు హన్మంత్ షిండే, సౌదాదర్   గంగారాం, కూమారి అరుణాతారా, మాజీ ఎంపి సురేష్ శెట్కార్ , వివిధ మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, మాాజీ సర్పంచ్ లు , వివిద గ్రామాల ప్రజలు , పాల్గోనాలని సంఘం సబ్యులు తెలిపారు. అంతకు ముందు వీరశైవ లింగాయత్ పోస్టర్ ను విడుదల చేసారు.
Spread the love