మహాజన సభను విజయవంతం చేయండి: ఏవో నవీన్

నవతెలంగాణ – అశ్వారావుపేట 
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న రైతు బరోసా పై నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట,నారాయణ పురం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఆద్వర్యంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బాబురావు అద్యక్షతన గురువారం నిర్వహించే రైతు బరోసా మహాజన సభను జయప్రదం చేయాలని ఏవో వై.నవీన్ బుధవారం తెలిపారు. ఇందులో రైతు భరోసా పథకం మీద రైతుల అభిప్రాయం సేకరణ ఉంటుందని,పేరాయిగూడెం,నారాయణపురం రైతు వేదికల్లో ఉదయం 10 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించే ఈ సభలకు పెద్ద ఎత్తున రైతులు హాజరైన వారి అమూల్యమైన అభిప్రాయాలు,ఆలోచనలను తెలియజేసి విజయవంతం చేయాలని కోరారు.
Spread the love