అంకిరెడ్డిగూడెంలో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అంకిరెడ్డిగూడెంలో ఓ వ్యక్తి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కబీరాజ్ సాహు తండ్రి పరమేశ్వర సాహు వయస్సు:(32) సంలు,వృత్తి:మెకానిక్,సాహు సదన్, కృష్ణ నగర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ సొంత గ్రామం.కబీర్ సాహూ గది లోపలికి బోల్టు వేసి లుంగీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల సమాచారంతో పోలీసులు తలుపును పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతున్నాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.
Spread the love