రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

-వ్యక్తి మృతి వివరాలపై రైల్వే ఎస్సైని సంప్రదించండి
నవ తెలంగాణ కంటేశ్వర్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ మగ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే ఎస్సై తావు నాయక్ బుధవారం తెలిపారు. రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి వయస్సు అందాడ 30-35 సంవత్సారాలు ఈరోజు తేదీ. 11.10.2023 ఉదయం 0830 గంటలకు ముందు జానకంపెట్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో గుర్తు తెలియని కారణాల వలన గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా మృతుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినామని నిజామాబాద్ రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. ఏవైనా వివరాలు ఉంటే 8712658591 కు సంప్రదించాలి అని తెలిపినారు.
Spread the love