ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల రోడ్లకు మహార్దశ..

నవతెలంగాణ -ఆర్మూర్
నియోజకవర్గ పరిధిలోని నూతన రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చూసింది. ఈ జాబితా లో  మచ్చర్ల నుండి జోర్పూర్ 3 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది. దేగం నుండి గోదావరి గంగా వరకు 4 కోట్ల 65 లక్షల రూపాయలు మంజూరు చేసింది.  ఆర్మూర్ నుండి పిప్రి వరకు లంబడి పోచమ్మ మరియు నల్ల పోచమ్మ మీదుగా 6 కోట్ల రూపాయలు మంజూరు చూసింది. ఇందుకు మొత్తం రూపాయలు 13 కోట్ల 80 లక్షలు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Spread the love