కాంట్రాక్టు ఏఎన్ఎంల నిరసన కార్యక్రమం

నవతెలంగాణ- ఆర్మూర్ 

కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని  ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 9 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు వీరికి సిఐటియు మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ శనివారం కూతాడు ఎల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీగా వెళుతూ ఎమ్మార్వో కార్యాలయం ముందు నుండి అంబేద్కర్అంబేద్కర్ చివరస్త వరకు వచ్చి అంబేద్కర్ చివరస్తలో మానవహారం 10 నిమిషాలు  చేసినారు కాంట్రాక్టు ఏఎన్ఎం మూల సమస్యలను తొందరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి జ్ఞానోదయం కలగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతిపత్రం సమస్యలతో కూడినటువంటిది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని కరోనా సమయంలో వాళ్ల ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇల్లు ఇల్లు తిరుగుతూ మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ముందుండి ప్రచారం చేసి వ్యాక్సిన్ వేసినారు దగ్గు దమ్ము వచ్చిన వారికి మందులు సప్లై చేస్తారు అట్లాగే గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేసి ముర్రుపాలను పిల్లలకు త్రాగించడంలో ముందు వరసలో ఉంటారు చాలీచాలని వేతనాలతో పిల్లలను పై చదువులు చదివించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే వేతనము సరిపోవటం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము  కాంట్రాక్టు ఏఎన్ఎం మూల చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు గంగా జమున ,ప్రమీల అమృత కమల సప్న పద్మ విమల రాధిక మమత సుమలత కవిత తదితరులు పాల్గొన్నారు..
Spread the love