లయన్స్ క్లబ్ ఆఫ్ న వ నాతపురం ఆధ్వర్యంలో డయాబెటిక్ క్యాంప్

నవతెలంగాణ- ఆర్మూర్ 
లయన్స్ క్లబ్ అఫ్  నవనాథపురం ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల పార్క్ లో డయబెటిక్ క్యాంపు ను నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ తెలిపారు. సుమారు 74 మంది స్త్రీ, పూరషులకు ప్రయివేట్ మెడికల్ ప్రాక్టిషనర్ డాక్టర్ దోపతి ప్రవీణ్ కుమార్ పరీక్షలు చేశారని అన్నారు తీపిని అధికంగా  తీసుకోవడం వలన చిన్న వయస్సు లోనే కంటి సమస్యలు, సైనస్,వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంతేగాక రోగ నిరోధక శక్తి తగ్గి అనేక సమస్యలు వస్తాయని, చక్కర వాడకం ను తగ్గించాలని, రోజుకు కనీసం 30నిముషాలు  వ్యాయామం చేయాలని డయబెటిక్ సమస్య రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ అన్నారు… వీరితో పాటు కార్యదర్శి చెరుకు ప్రీథ్వీ రాజ్,కొంగి మనోహర్, లోచర్ చంద్రశేఖర్, బైరి శ్రీధర్ వాకర్స్ పాల్గొన్నారు.
Spread the love