మండల సర్వసభ్య సమావేశం..

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సమావేశంలో తాడూరి వెంకట్ రెడ్డి సర్వసభ్య నివేదికను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని అన్నారు. ఫిబ్రవరి 2  తేదిన సర్పంచ్ల పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా వారి బిల్లులు తక్షణమే ఎంబిలు చేయాలని అధికారులకు ఆదేశించారు.పంతంగి సర్పంచ్ బాతరాజు సత్య మాట్లాడుతూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. ఈ బిల్లు సర్పంచ్లకు పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు.సర్పంచులు అప్పులతో చనిపోతున్న చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ నిధులు వస్తున్నా యంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప మరొకటి లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచ్లకు న్యాయం చేయాలని అన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేక పోయిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.పెద్ద కొండూరు సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్ మాట్లాడు తూ గ్రామపంచాయతీ నిధులు కరెంటు బిల్లులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ల మెయింటెన్స్ చేయించడా నికి సరిపోయయాని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలతో కాలం వెలదీసిందని త్రీవ ఆవేదన వ్యక్తం చేశారు.దండు మల్కాపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 72 ఉంటే 68 ఇండ్లు ఇచ్చారని మరో 4 ఇండ్లు కేటాయించిన పెండింగ్లో పెట్టారని తాడురి వెంకట్ రెడ్డి అన్నారు.నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కనుక ప్రతి ఒక్క వర్గాలకు సమన్యాయం సామాజిక న్యాయం అందుతుందని మండల పరిషత్ అధ్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య,ఎంపీడీవో సందీప్ కుమార్,ఎంపీఓ నరసింహారావు, పంచాయ తీరాజ్ డిఈ ఎంపీటీసీలు చిట్టెంపల్లి శ్రీనివాసరావు, బద్దం కొండల్ రెడ్డి సర్పంచ్లు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Spread the love