కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మండల సైదులు..

నవతెలంగాణ- మునుగోడు
నల్గొండ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు తమ పదవికి రాజీనామా చేసి బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి సమక్షంలో తమ నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా మండల సైదులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా  కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తిరిగి ప్రచారం చేసి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు . మునుగోడు నియోజకవర్గం లో అభివృద్ధి జరగాలంటే కూసుకుంట్ల తనే సాధ్యమని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో పాల్వాయి వెంకటరెడ్డి , గోపి , ఎల్లంకి శ్రీశైలం తదితరులు ఉన్నారు.
Spread the love