మండలానికో వీడియో కాన్ఫరెన్స్ సెట్..

Mandalanico Video Conference Set..– వారం వారం సాగు పై అవగాహన..
– రైతు నేస్తంతో అన్నదాలకు చేరువ కానున్న వ్యవసాయ శాఖ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లో ఏర్పాటు నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు నేస్తం తో అన్నదాతలకు మరింత చేరువ కానుంది. రైతు బరోసా తో సాగుచేసే రైతులకే పంట పెట్టుబడి,గురువారం నుండే ఋణమాఫీ అమలు చేయనుంది. ఈ క్రమంలో మండలానికో వీసీ సెట్ ను అందించి వాటిని సైతం గురువారం నుండే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం,పేరాయి గూడెం పంచాయితీ పరిధిలో గల రైతువేదిక లో వీసీ సెట్ ను ఏర్పాటు చేసారు. ఈ సెట్ ను సైతం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ వీసీ సెట్ ద్వారా రైతు నేస్థం పేరు తో రైతులకు వ్యవసాయం ,సాగు పద్దతులు,పంటలకు ఆశించే చీడపీడలు,అధిక దిగుబడులు కు మెలుకువలు పై అవగాహన కల్పిస్తారు. గురువారం నిర్వహించే కార్యక్రమానికి అధిక రైతులు హాజరు కావాలని వ్యవసాయ అధికారులు అఫ్జల్ బేగం,నవీన్ లు కోరారు.
Spread the love