Thursday, June 18, 2026
E-PAPER
Homeఖమ్మంపీఎస్ గాండ్లగూడెం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

పీఎస్ గాండ్లగూడెం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
పీఎస్ గాండ్లగూడెం పాఠశాలలో ఈ రోజు ప్రీ-ప్రైమరీ, 1 వ తరగతి విద్యార్థులకు గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యాభ్యాసానికి తొలి మెట్టుగా భావించే ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం (సిద్ధు), ఉపాధ్యాయులు దుర్గా ప్రసన్న పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై చిన్నారుల విద్యా ప్రస్థానానికి శుభారంభం పలికారు.

విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఉపాధ్యాయులు తెలిపారు. అక్షరాభ్యాసం ద్వారా చిన్నారుల విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -