- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులోగల ఒక డెకరేషన్ సామాగ్రి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



