బీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు..

నవతెలంగాణ- చివ్వేంల: అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం అని బీఆర్‌ఎస్‌ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం బండమీది చందుపట్ల గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు ఆధ్వర్యంలో ఓపిడిఆర్ పార్టీ ఎంపీటీసీ కోడి బండ్లయ్య తోపాటు బీజేపీ, కాంగ్రెస్, బిఎస్ పి పార్టీ లకు చెందిన 200మంది జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండావాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేటి కెసిఆర్ పాలనలో రాష్ట్రం లో ప్రజలు మూడుపూటలు కడుపు నింపుతున్న ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటల అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, జడ్పిటిసి సంజీవ్ నాయక్, సర్పంచ్ బోయిల కృష్ణ, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ధరావత్ బాబు నాయక్, బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు శిగ వీరస్వామి, అమరగాని అబ్బులు గౌడ్, కోడి సురేష్, శిగశ్రీను, కలగాని వెంకన్న, కోడి కృష్ణ, బొడ్డు వెంకన్న, రమేష్, గుద్దేటి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

Spread the love