Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచికాగో పోరాటస్ఫూర్తితో మేడే ఉత్సవాలు

చికాగో పోరాటస్ఫూర్తితో మేడే ఉత్సవాలు

- Advertisement -

వేతన సవరణ చట్టాలను అమలు చేయా
లిఐఎల్‌ఓ సమావేశాలను జరపాలి :సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

చికాగో నగరంలో 140 ఏండ్ల కిందట 8 గంటల పని విధానంకోసం పోరాడి ప్రాణా లొదిలిన అమరులను స్మరిం చుకుంటూ.. భారతదేశంలో సామాన్య ప్రజలపై జరుగు తున్న దాడులను ప్రతిఘటిం చేందుకు కార్మికులను సంఘటిత పరిచి సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంతో నయా ఫాసిస్టు విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు. కోట్లాది మంది ట్రేడ్‌ యూనియన్‌ హక్కుల మీద దాడి చేస్తోందన్నారు. నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చి అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసే విధానాలను తీసుకుంటున్న నేపథ్యంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాట పంథాను ఎంచుకున్నాయని చెప్పారు.

అందుకే ఇది పెద్ద వర్గ ఘర్షణగా మారబోతుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 11న ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో వేలాది మంది కార్మికులు రోడ్లమీదకి వచ్చి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎల్‌ఓ ధ్రువీకరించిన 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తారా? కార్పొరేట్ల కోసం 12 గంటల పని విధానానికి సిద్ధమవుతారా? అనే విషయాన్ని మేడే ఒకటిన కార్మికలోకం తేల్చుకోనున్నద న్నారు. ఫ్యాక్టరీ, కార్ఖానా, అసంఘటిత రంగం, గ్రామీణం.. పట్టణ ప్రాంతం ఏదైనప్పటికీ చికాగో నగర పోరాటస్ఫూర్తిని దేశం నలువైపులా వినబడేలా నిలబ డాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పిలుపునిచ్చామన్నారు.

ఉమ్మడి ఏపీలో చేసిన జీవోలనే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్మిక, యాజమాన్య విభేదాల్లో పోలీసుల జోక్యాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఆర్టికల్‌19 ప్రకారం యూనియన్లు పెట్టుకోవచ్చు, సమ్మె చేయొచ్చు, యాజమాన్యంతో చర్చలు జరపడానికి రాజ్యాంగం హక్కు కల్పిం చిందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక దుర్మార్గమైన విధానం అమలవుతోందని, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ లేబర్‌ మీటింగ్‌లకు మాత్రం కార్మిక సంఘాలతో హాజరవుతారు కానీ ఐఎల్‌ఓ తీర్మానాలను దేశంలో అమలు చేయడానికి మాత్రం వ్యతిరేకిస్తోందని చెప్పారు. తక్షణమే మోడీ ప్రభుత్వం ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ సమావేశాన్ని నిర్వహించాలని, కార్మిక సంఘాల వాదనను వినాలని డిమాండ్‌ చేశారు. పని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాక్ట్‌ను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి, అవుట రవీందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -