సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో ‘నో స్టాక్ బోర్డులు’ కనపడుతున్నాయనీ, దీంతో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి సామాన్యుడిని దోచుకునేందుకు పన్నిన కుట్రలో భాగమే ఇదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చమురు సంస్థల ద్వారా అన్ని బంకులకు ఆయిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇందన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కృత్రిమ కొరతను సృష్టించడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యకు నిదర్శనమని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో అయిల్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచకుండా నిలిపేసిందనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై ధరల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసిందని పేర్కొన్నారు. రష్యా నుంచి అతి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నా, ఆ లాభాన్ని ప్రజలకు పంచకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని తెలిపారు. పెట్రోల్ బంక్ డీలర్లు ముందస్తుగా వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు చెల్లించినప్పటికీ, చమురు సంస్థలు ఆయిల్ టాంక్లర్లను పంపడం లేదని పేర్కొన్నారు. డీజిల్ దొరకక రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంధనం దొరకక లారీలు, వాహనాలు నిలిచిపోయే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. దీంతో నిత్యావసరాల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చమురు నిల్వలలను తక్షణమే విడుదల చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంకులకు పూర్తిస్థాయిలో ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



