రైతులు సద్వినియోగం చేసుకోవాలి
శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం లాభసాటి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ- అశ్వారావుపేట
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ కె.నాగాంజలి, డాక్టర్ ఐ.కృష్ణతేజ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే శాస్త్రీయ పద్ధతులను అనుసరించాల న్నారు. ప్రత్యేకంగా సేంద్రీయ వ్యవసాయం, సూచించిన మేరకు ఎరువుల వినియోగం, పంట మార్పిడి, సాగునీటి పొదుపు వంటి అంశాలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే దిగుబడులు పెరగడంతోపాటు సాగు పెట్టుబడి తగ్గుతుందని చెప్పారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జై.హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు ఆరు ముఖ్య వ్యవసాయ సూత్రాలపై అవగాహన పెంపొందించుకొని, రాబోయే వానాకాల పంట సాగుకు ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు. డా.నాగాంజలి.. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను రైతులకు వివరించి, భూమి ఆరోగ్యం కాపాడుకోవాలంటే సహజ పద్ధతుల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక లాభాలు పొందొ చ్చన్నారు. డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, పంట సాగులో సుస్థిరత సాధించాలంటే నేల స్వభావానికి అనుగుణంగా ఎరువుల వినియోగం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పి.రవికుమార్, ఆత్మ కమిటీ చైర్మెన్ ఎస్.వీరభద్రరావు, ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ జూపల్లి రమేష్, తిరుమలకుంట సర్పంచ్, జిల్లా టెలికాం కమిటీ సభ్యులు పి.రామలక్ష్మయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్వప్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగు, బాపిరెడ్డి, ఉద్యాన విస్తరణాధికారి ఈశ్వర్, ఆయిల్‌పామ్ ఆఫీసర్ యశస్వి, ఆయిల్‌పామ్ మానిటరింగ్ ఆఫీసర్ శివప్రసాద్, శ్రీనివాస్, విస్తరణాధికారి రవీంద్ర, రెడ్డిగూడెం సర్పంచ్ యు.వెంకటరమణ, రెడ్డిగూడెం వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీను పాల్గొన్నారు.
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



