ప్రజా ఉద్యమాల నాయకుడు ఎండి జాంగీర్ ను ఎంపీగా గెలిపించాలి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ప్రజా ఉద్యమాల నాయకుడు ఎండి జాంగీర్ ను గెలిపించాలని మంగళవారం చిన్నకొండూరు గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ మాట్లాడుతూ.. భారత పరిరక్షణ కోసం దేశ ఆర్థిక స్వాలంబన కోసం లౌకిక రాజ్యాంగ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం జరిగే కీలకమైన ఎన్నికల్లో బీజేపీని ఓడించి సీపీఐ(ఎం) అభ్యర్థి జాంగీర్ గారిని గెలిపించాలని నిరంతరం ప్రజల మధ్యనే ఉండి ప్రజా ఉద్యమాలు నడిపిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న నాయకుడి జాంగీర్ జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రధానంగా మూసి ప్రక్షాళన చేయాలని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వం పోరాటం చేసినాడు. అలాంటి నాయకున్ని పార్లమెంట్ కు గెలిపించి పంపాలని కోరారు. ఈ కార్యక్రమానికి చింతల సుదర్శన్ మండల కమిటీ సభ్యులు చింతల యాదయ్య మేడ్చల్ జిల్లా సీపీఐ(ఎం) కమిటీ సభ్యులు గడగోట్టి జంగయ్య తూర్పునూరి జంగయ్య చీమకండ్ల శ్రీరాములు,జింకల యాదయ్య నత్తి నరేష్,పద్మ భాస్కర్ నాగమణి యాదగిరి అనిత చిలువేరి కృష్ణ స్వామి నరసింహ ఎలక రాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love