నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని మేడారం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్, నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్కీం కింద సెలెక్ట్ అయినట్లు ములుగు జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ విపిన్ తెలిపారు. బుధవారం తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రణధీర్, మీద వైద్య బృందంతో కలిసి సందర్శించి పరిశీలించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్కీం కింద చేయవలసిన పనులను సిబ్బందితో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాడ్వాయి వైద్యాధికారి డాక్టర్ రణధీరతో సమీక్షా నిర్వహించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అసంక్రమిత వ్యాధులు, బిపి, మధుమేహం, పరీక్షలను మూడవ దశను 100%పూర్తి చేయాలని, నిర్ధారణ అయిన వారికి మందులను అందించాలని ఆశలకు, సిబ్బందికి సూచించారు. జిల్లా పిల్లల ఆరోగ్యం మరియు వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ రణధీర్ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి, లబ్ధిదారుల జాబితాను, వ్యాక్సిన్ యొక్క వివిఎం రికార్డులను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు, డాక్టర్ శ్యామ్, డిస్టిక్ క్వాలిటీ ఆక్సిడెంట్ మేనేజర్ శరత్, హెల్త్ సూపర్వైజర్ సరస్వతి, ఆరోగ్య కార్యకర్త చేల తిరుపతయ్య, రాజ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.