భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం

– పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ
నవతెలంగాణ – శంకరపట్నం
ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు బుకింగ్‌ చేసుకునే సదుపాయం తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి బుక్ చేసుకోవాలని తెలిపారు.మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్‌ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తాం. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ అన్నారు.రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ మార్కెటింగ్  ఎగ్జిక్యూటివ్ :చంద్రమౌళి :95738 51108,91542 98559 సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ (ఏటీఎం )కార్గో సదాశివ్ ,కరీంనగర్ రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్  రాజు ,హుజురాబాద్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి,గుర్రం స్వామి, భక్తులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love