ప్రాథమీక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన వైద్యాధికారి గోపాల్ రావు

Medical officer Gopal Rao inspected the primary health centerనవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు మంగళవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ రూమును సందర్శించి ల్యాబ్ లో ఉపయోగించే రీయేజెంట్స్, మరియు  రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను ఆప్యాయతతో పలకరించి, అన్ని ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. జ్వరముతో వచ్చిన ప్రతి వ్యక్తికి  మలేరియా  డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తెలిపారు . ల్యాబ్ కు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్ (మందుల గది) సందర్శించి అందుబాటులోని మందుల వివరాలు తెలుసుకొని ముందస్తుగానే మందులకు ఇండెంట్ పెట్టి తీసుకోవాలని సూచించారు.   రోగుల వార్డును సందర్శించి, సేవలను అందిస్తున్న రోగి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రంజిత్ చేసిన సేవలకు సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, వారి ఉద్దేశించి మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును ఆరోగ్య కార్యకర్తల ద్వారా అడిగి తెలుసుకుని 100% లక్ష్యాన్ని సాధించాలని, లేనియెడల శాఖ పరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాత శిశు సంరక్షణ మరియు పోషణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. శ్రీకాంత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ .రంజిత్, ఆరోగ్య విస్తరణాధికారి సమ్మయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ రాంబాయి, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ సంతోషీ, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love