
మాతృ మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు. రాజంపేట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచనలు సలహాలు పాటించి మందులు వాడాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకుని పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, మాతృ, శిశు మరణాల రేటు తగ్గించడం కోసం పుట్టిన వెంటనే ముర్రుపాలతో పాటు 0 ఓపివి హైపటైటిస్ బి డి సి జి అందించడానికి వీలవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అందించే పారిదోషకాలు పొందడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. బాల్యవివాహాలు జరగడం వలన మాతృ మరణం సంభవిస్తుందని, బిడ్డకు బిడ్డకు మధ్య వ్యవధి లేకపోవడం వలన మాతృ మరణం సంభవించవచ్చని, చిన్నతనంలోనే పెళ్లిళ్లు కావడం ఐరన్ లోపం ఉండడం వలన మాతృ మరణాలకు దారితీస్తుందని తెలియజేశారు. ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే నులి పురుగు దినోత్సవ కార్యక్రమం గురించి వైద్య సిబ్బందికి వివరించారు. గ్రామాలలో వైద్య సేవలు, రికార్డుల నమోదు వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యుల సంగీత, హెల్త్ సూపర్వైజర్ మంజూర్, గంగమణి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.