ఘనంగా పది విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నవతెలంగాణ-ఉప్పునుంతల
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ, వీడిపోమంటూ స్టూడెంట్ నంబర్ వన్ సినీమా తరహాలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం ఉప్పునుంతల మండలం పెనిమిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధానోపాధ్యాయులు నర్సింహ్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా 10 వ తరగతి విద్యార్థులు పాఠశాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత స్థానాలలో ఉంటామని, పాఠశాల పేరును నిలబెడతామని తెలిపారు. మిగతా తరగతుల విద్యార్థులు వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించటం వలన సమవేశం అంతా గంభీర వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. పదవ తరగతిలో 100% శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశీర్వదించారు. 10 వ తరగతి విద్యార్థులకు హాలెటికెట్స్ ఇస్తూ, విద్యార్థులంతా పరిక్షలు బాగా వ్రాసి పాస్ కావాలని 10/10 GPA సాధించాలని విద్యార్థులను కోరారు.
Spread the love