నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించుటకు పిఒఏపిఓఓపిఓలకు బుదవారం రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు పిఒఏపిఓఓపిఓలు బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల నిర్వహణ పైన ట్రైనింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఎన్నికలల్లో విధులు నిర్వహించ వలసిన ప్రతి ఒక్క అధికారి బాధ్యత పని చేయాలన్నారు. ఈ కార్యక్రమములో హుస్నాబాద్ తహసిల్దార్ రవీందర్ రెడ్డి , అక్కన్నపెట తహసిల్దార్ సంజీవ్ కుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అశోక్ పాల్గొన్నారు.