రామగుండం నియోజకవర్గంలోని జనగామలో సోమవారం యాదవ సంఘం అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ప్రతి కుటుంబంలోని సభ్యులందరు ఆరోగ్యంతో ఉంటేనే వారి కుటుంబం ఉన్నతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు భూమయ్య తెలిపారు. సహకరించిన కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ వైద్య శిబిరం కు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి సంబందించిన దీర్ఘకాలిక వ్యాధులు మరియు వారికి ఉన్న అనారోగ్య సమస్యలు డాక్టర్ల కు వివరించగా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్, ECG, పరీక్షలు, నిర్వహించడం మందులు రాయటం మరియు ఇంకా అవసరం ఉన్నవారికి టెస్ట్ లు పరీక్షలు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కరీంనగర్ లో ఉచిత వైద్య పరీక్షలు చేస్తారు అని అక్కడికి వచ్చిన ప్రజలకు చెప్పటం జరిగింది.. ఇంకా ఈ కార్యక్రమం లో యాదవ్ సంఘం పెద్దలు గుండబోయిన వెంకటి, అర్కుటి శంకర్, ఎర్ర మల్లన్న, గుండెబోయిన భూమయ్య గుండెబోయిన సదానందం, ఆరుకుటి రాజయ్య, పైడిద రాజు గుండెబోయిన సంతోష్ గ్రామ నాయకులు తోకల రమేష్, జనగామ శివ, ఆకుదారి కత్తెరసాల,జనగామ బద్రి,ఇరుగురాల శివ, జనగామ శివరామకృష్ణా, కాదాసి శంకర్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.