ప్రచార రథాన్ని ప్రారంభించిన రాష్ట్ర కమిటీ సభ్యులు: నారి ఐలయ్య

నవతెలంగాణ – వలిగొండ రూరల్
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్  ఎన్నికల ప్రచార వాహనాన్ని సోమవారం పొద్దుటూరు గ్రామంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్  సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార వాహనం పొద్దుటూరులో ప్రారంభమై ఎదుల్లగూడెం,టేకుల సోమారం,రెడ్ల రేపాక,దాసిరెడ్డిగూడం,వలిగొండ,నాగారం,నెమలి కాలువ,గోల్నేపల్లి,జాలుకాలువ   గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండలకార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కురి రామచందర్,కూర శ్రీనివాస్,మండల కమిటి సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, కవిడే సురేష్,వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,సింగిల్ విండో మాజీ డైరక్టర్ పలుసం బాలయ్య,శాఖ కార్యదర్శి పలుసం లింగం,పిఎన్ఎం జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు గంటేపాక శివ,ఈర్లపల్లి ముత్యాలు,నాయకులు వేముల నాగరాజు,ఆకుల రాజు,పరమేష్,వేముల జ్యోతి బస్,నాయకులు గడ్డం సుదర్శన్,పెద్దబోయిన శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love