ఎస్సైను సన్మానిస్తున్న హోటల్స్ అసోసియేషన్ సభ్యులు

నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మండల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తిరుమలగిరి నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ ను పోలీస్ స్టేషన్ లో ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు చింతకింది మురళి ,ఉయ్యాల వీరేష్ మాట్లాడుతూ నూతనంగా తిరుమలగిరి ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకు వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు ఎలాంటి సమస్యలకైనా తాము పోలీస్ శాఖకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని వారన్నారు. తమ హోటల్ ముందు సీసీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకుంటామని వారన్నారు. తమ హోటల్ లో మద్యం సేవించడానికి అనుమతించమని వారన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు కాలియా రాజపుత్, బాబా శ్రీహరి, చింతకింది వీరస్వామి సంజీవరెడ్డి, రాములు, గోపి వెంకన్న, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love