– అవకతవకలపై చర్యలకు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫార్మా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహను కలిశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మాసిస్టుల పాత్ర, సేవలు చాలా ప్రధానమైనవని మంత్రి కొనియాడారు. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో అవకతవకలు, కరప్షన్ ప్రాక్టీసెస్, ఫేక్ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో అవకతవకలు, ఫార్మసిస్టుల సమస్యల గురించి మంత్రికి విన్నవించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సంజరు రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ ఆనంద్, యూత్ వింగ్ ప్రెసిడెంట్ కల్యాణ్ తదితరులు ఉన్నారు.