కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్ లను పరిశీలించిన ఎంఈఓ మధుసూధన్

నవతెలంగాణ – సారంగాపూర్ :  మండలంలోని జామ్ గ్రామంలో గల కేజీ బీవీ,సోషల్ వెల్ఫేర్ స్కూల్ ను సోమవారం ఏంఈఓ  మధుసూధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది భోజనశాల సరుకుల నిల్వ లతో పాటు స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసారు. అనంతరం  తాజా కూరగాయలు నాణ్యమైన సరుకులతో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని  గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక, కేజిబివి ఎస్.ఓ అన్నపూర్ణలకు ఆదేశించారు.
Spread the love