డాలరు కాళ్లైంది
డాలరు రెక్కల్లైంది
మోహించి
డాలరు ముఖానికి
వలస జీవితాన్నద్దితే
వెలిగిపోతూ
బతుకును
ఎదురు తన్నుతోందిప్పుడు
కాళ్ళూ చేతులూ
సంకెళ్ల కుదించి
ఏళ్ళ కొద్ది కరుడు గట్టిన కలల్ని
గాలి మోటర్కు కట్టేశాడు
అక్రమ వలస కండల అంకుల్ శ్యామ్!
డాలరు కలలకు
తలుపులు మూసి
సవతి తల్లి పేగు బంధం
కొరికేస్తుంటే
అమెరికా మోడీ అదానీ ప్రేమలో
తడిసిన ఉపఖండ సింహాసనం
నాలిక పీకేసుకొని
వర్ణ వివక్ష నేల మీంచి
మతార్దిక వివక్షల మాతభూమి విసిరిన
రెక్కలు తెగిన వలస యవ్వనానికి
భారీ పకోడీ తోరణం కట్టింది
అచ్చేదిన్ ముఖంతోటి
స్వాగతంగా –
– వడ్డెబోయిన శ్రీనివాస్
9885756071