పుట్టు పంచె, పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన మంత్రి దంపతులు

నవతెలంగాణ – రేవల్లి
ఆదివారం రేవల్లి మండల జడ్పిటిసి భీమయ్య కుమార్తె, కుమారుని పుట్టు చీర, పుట్టు పంచె ఫంక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో  చిన్నారులను  మంత్రి నిరంజన్ రెడ్డి తన దంపతులతో కలసి హాజరై ఆశీర్వదించారు. ఇట్టి కార్యక్రమంలో వనపర్తి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, సింగిల్ విండో చైర్మన్ లోడే రఘు, రేవల్లి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివరాం రెడ్డి, నాగపూర్ శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల రాములు, నాగం తిరుపతి రెడ్డి, వనపర్తి జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ డైరెక్టర్ మరియు సోషల్ మీడియా కన్వీనర్ జనంపల్లి బీచుపల్లి యాదవ్, నియోజకవర్గ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love