రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి  పర్యటన

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్

రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. 10:30 నుండి 12:30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొనున్నారు. 12:30 గంటలకు నల్లగొండ నుండి బయలుదేరి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చేరుకుంటారు.అక్కడ బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి నల్లగొండ చేరుకొని జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని  స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్లను ప్రధానోత్సవం చేస్తారు. 2:30 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళతారు.
Spread the love