హుస్నాబాద్ పట్టణంలోని 7 వ వార్డ్ కి చెందిన సయ్యద్ సాధిక్ (6) ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందగా.. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏ డి ఈ శ్రీనివాస్, ఏఈ శశిధర్ రెడ్డి, కౌన్సిలర్ చిత్తారి పద్మ పాల్గొన్నారు.