నాగేపల్లి స్టేజిలో ఆటో బోల్తా పడి చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోమవారం పరమార్షించారు. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి మండలంలోని మల్లారం గ్రామానికి మిర్చి ఎరేందుకు ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు ఈనెల 21న యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. వారిని మంథని, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్ తదితర పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించి అదైర్య పడొద్దు, మీకు ప్రభుత్వం అన్నివిధాలా అండగాఉంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను, ఆస్పత్రి సిబ్బందిని మంత్రి ఆదేశించారు.