నవతెలంగాణ-మల్హర్ రావు : మండలం వల్లెంకుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు,ప్రజలు ఆదివారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.2023 జూలై 27 అధిక వర్షాలు కురిసి మానేరు నది ప్రక్కనున్న పొలాలు ఇసుక మెటలు వేయడం రైతులకు నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా శ్రీదర్ బాబు మెటలు పెట్టిన పొలాలు పరిశీలించిన క్రమంలో పొలాలకు వెళ్లేదారి బాగలేకపోవడం రైతులు రోడ్డు మంజూరు చేయాలని అడగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో రూ.1కోటి 80 లక్షలతో రోడ్డు మంజూరు చేసినందుకు ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి,శ్రీదర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ బొమ్మ రజిత,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి శ్రీదర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



